GNTR: నివాస స్థలాల రేట్లను చూపుతూ వ్యవసాయ భూములకు పరిహారం పెంచలేమని హైకోర్టు తీర్పునిచ్చింది. కడప జిల్లాలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం తీసుకున్న అసైన్డ్ భూములకు మెరుగైన పరిహారమే దక్కిందని పేర్కొంది. ఎకరాకు రూ.1.50 లక్షలతో పాటు ఇతర ప్రయోజనాలు చెల్లించినట్లు గుర్తు చేసింది. ఈ మేరకు పరిహారం పెంపు అప్పీళ్లను ధర్మాసనం తోసిపుచ్చింది.