ASR: జాతీయ రహదారి నిర్మా ణ పనులకు నిబంధనలకు కట్టుబడి సహకరించాలని దుకాణాదారులకు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ సూచించారు. డుంబ్రిగుడ మండల కేంద్రంలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా దుకాణాలను గురువారం రాత్రి పరిశీలించారు. ఎన్హెచ్ అధికారులు నిర్దేశాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఇప్పటికే నష్టపోయిన దుకాణాలకు నష్టపరిహారం చెల్లించినట్టు చెప్పారు.