TG: హైదరాబాద్ అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం బేగంపేటలోని హరిత ప్లాజాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కేంద్రం, రాష్ట్రాలు కేటాయించిన నిధులు, వినియోగం, పనుల పురోగతిపై సమీక్షించారు. GHMC పరిధిలో శౌచాలయాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శౌచాలయాల్లో కనీస సౌకర్యాలు లేకపోవటం దారుణమన్నారు. స్వచ్ఛభారత్‌లో కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.