ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును ఆయన కార్యాలయంలో ఆదివాసీ నిరుద్యోగ ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులు కలిశారు. ఈ మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సీ ప్రకటించి చట్ట బద్ధత కల్పించాలని, రానున్న అసెంబ్లీ సమావేశాలలో TAC తీర్మానం చేయాలని వినతి పత్రం అందజేశారు. ఇందులో కమిటీ సభ్యులు రామకృష్ణ, దారయ్య, మోహన్, చంద్రరావు పాల్గొన్నారు.