హైదరాబాద్: నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. తనకు తెలియకుండా తల్లి, సోదరి షేర్లు బదిలీ చేసుకున్నారని జగన్ పిటిషన్ వేశారు. ఈ కేసులో విజయమ్మ, షర్మిల, జనార్దన్‌రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. షేర్ల బదిలీ ఫారాలు సమర్పించకుండానే తమ పేరిట మార్చుకున్నారని ఆరోపించారు. కౌంటర్ దాఖలుకు ప్రతివాదులు సమయం కోరగా విచారణను వచ్చేనెల 13కి NCLT వాయిదా వేసింది.