TG: మూసీ కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని భావిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్కు దోచుకోవడమే తెలుసు.. ప్రజల కష్టాలు తెలియవని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టులో రూ.25 వేల కోట్లు తాను తినేశానని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు దోచుకోవాలనే ఆలోచన ఉంటే ధరణి ద్వారా గోల్మాల్ చేస్తే సరిపోతుందన్నారు.