TG: హైదరాబాద్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. ఉప్పల్ శాంతినగర్‌లోని AVD కంపెనీలో తనిఖీలు చేశారు. ఐదున్నర టన్నుల స్వీట్స్, కారాబూందీని అధికారులు సీజ్ చేశారు. బాత్రూమ్ల పక్కనే స్వీట్స్, బూందీ తయారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. స్వీట్స్ తయారీలో నాణ్యతలేని నూనె, ప్యాకింగ్‌పై గడువు తేదీ లేనట్లు గుర్తించారు. HYDలోని పలు షాపులకు AVD కంపెనీ నుంచే స్వీట్స్, బూందీ సరఫరా అవుతుంటాయి.