TG: కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ స్పష్టం చేశారు. రోజురోజుకు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు దిగజారుతోందని ఆరోపించారు. తెలంగాణలో డబ్బును దోచుకొని ఏఐసీసీకి పంపిస్తోందని, బంగారు బాతులా రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఉపయోగించుకుంటుందన్నారు. హర్యానా ఎన్నికలకు తెలంగాణ నుంచి డబ్బులు పంపించారని, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగే ఎన్నికలకు వెళ్తున్నాయని ఆరోపించారు.