విచారణ కేసుల విషయంలో మీడియాకు కేరళ హైకోర్టు చురకలు అంటించింది. న్యాయాధికారి పాత్ర పోషించకుండా మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించింది. భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక అంశాలే అయినా తప్పు, ఒప్పులను నిర్ధారించేందుకు మీడియా అనేది లైసెన్స్ కాదని స్పష్టం చేసింది. మీడియా ట్రయల్స్ కారణంగా న్యాయవ్యవస్థపై అపనమ్మకానికి దారితీస్తుందని అభిప్రాయపడింది.