కొంతమంది రాత్రిపూట భోజనం లేటుగా చేస్తుంటారు. రైస్ కాకుండా స్నాక్స్, బిస్కెట్స్, స్వీట్స్ తింటుంటారు. అయితే వాటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి స్వీట్స్ తినడం వల్ల రక్తంలోకి చక్కెరలు చేరి శరీరాన్ని క్షీణింపజేస్తాయి. పిజ్జా, బర్గర్ లాంటి పదార్ధాలు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అలాగే స్పైసీ ఫుడ్ జోలికి కూడా వెళ్లకపోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.