ప్రధాని మోదీ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లారు. నేడు అద్వానీ 97వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అద్వానీ ఇంటికి వెళ్లిన మోదీ.. పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.