ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైస్వాల్‌కు జోడీ ఎవరనే దానిపై సందిగ్దత నెలకొంది. బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్న అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్‌ను కాకుండా ధ్రువ్ జురెల్‌ను తీసుకుని గిల్‌తో ఓపెనింగ్ చేయించాలని టీమిండియాకు ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఫామ్‌లో లేని రాహుల్, ఈశ్వరన్‌ను ఆడిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లిస్తారని హెచ్చరిస్తున్నారు.