WGL: కబ్జాదారుల చెరువులో ఉన్న స్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని కోరుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి నేడు నాగయ్య పల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు మండలం నాగయ్యపల్లి గ్రామస్తులు స్మశాన వాటిక స్థల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.