TG: మూసీ ప్రక్షాళన సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు అని యాదాద్రి జిల్లా సంగెం సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఆరున్నరేళ్లు పడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రేవంత్ మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. మూసీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను తామే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.