SRPT: దేశంలో బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశ ప్రజలను నిరంకుశ పాలన వైపు తీసుకెళ్తుందని, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సూర్యాపేటలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల సమైక్యతకు భంగం కలిగిస్తూ.. రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టాలని అన్నారు.