SRD: ప్రయాణికుల సౌకర్యార్థం సమయానికి బస్సులు నడపాలని ఉమ్మడి జిల్లా RTC ఆర్ఎం ప్రభు లత అన్నారు. శుక్రవారం ఖేడ్ ఆర్టీసీ డిపోను ఆమె సందర్శించి తనిఖీ చేశారు. DM మల్లేశం, అసిస్టెంట్ మేనేజర్ నరసింహులతో సమావేశమై డిపో ఆదాయం వివరాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 13న అరుణాచలం ప్రత్యేక సూపర్ డీలక్స్ బస్సులు నడపాలని DMకు సూచించారు.