TG: డ్రగ్స్ కేసులో ఉగాండా దేశానికి చెందిన మహిళకు 13 ఏళ్ల శిక్షతో పాటు రూ.లక్ష జరిమానాను రంగారెడ్డి జిల్లా కోర్టు విధించింది. హరారే నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకువచ్చిన కేసులో మహిళను 2021 జూన్లో డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. మహిళ నుంచి 3.9 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 25.35 కోట్లు ఉంటుందని గుర్తించారు.