TG: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్పై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మోహన్ రావు వాదించారు. అనర్హతా పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ మేరకు పలు కోర్టుల తీర్పులను చదివి వినిపించారు. తదుపరి విచారణ సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.