OCD అనే పదం చాలాసార్లు వినే ఉంటాం. కానీ చాలా మందికి OCD లక్షణాలు ఎలా ఉంటాయో తెలియదు. ఈ డిజార్డర్ ఉన్నవారు ఒకే పనిని పదే పదే చేస్తూంటారు. ఎప్పుడు పడితే అప్పుడు చేతులు కడగడం, మాట్లాడేటప్పుడు అనుకోకుండా ఆలోచనలు రావడం, కంట్రోల్ చేసుకోలేని లైంగిక ఆలోచనలు వంటివి కలుగుతాయి. అంతే కాకుండా ఈ డిజార్డర్ ఉన్నవారికి భయం, అనారోగ్యం, డిప్రెషన్ సమస్యలు కూడా తలెత్తుతాయి.