AP: హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ సైబర్ క్రైమ్ సీఐని హైకోర్టు విచారించింది. సోషల్ మీడియా పోస్టులపై ఎన్ని కేసులు నమోదు చేశారని ఏజీని ప్రశ్నించింది. కొన్ని కేసుల్లో బీఎన్ఎస్ఎస్ నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్ సీసీ ఫుటేజ్‌ను సీల్డ్కవర్లో మేజిస్ట్రేట్ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.