AP: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వానికి పోలీస్ శాఖలోని పలువురు అధికారులు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టినట్లు తెలుస్తోంది.