కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై శివరాజ్ కుమార్ స్వయంగా స్పందించారు. తన అనారోగ్య సమస్యను తెలుసుకుని భయపడ్డానని తెలిపారు. ‘అభిమానులను కలవరపెట్టను. దాన్ని ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పొందా. ఇప్పుడు అంతా బాగానే ఉంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను మనిషినే కదా.. నాకు సమస్యలు వస్తుంటాయి. చికిత్స పొందుతున్నా’ అని పేర్కొన్నారు.