యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో ఓ గ్యాంగ్ యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఏకంగా నకిలీ నోట్లను ప్రింటింగ్ చేసింది. సతీష్ రాయ్, ప్రమోద్ మిశ్రా అనే నిందితులు రూ.10 స్టాంప్ పేపర్లపై నకిలీ రూ.500 నోట్లను ప్రింటింగ్ చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.30వేలు విలువైన నకిలీ కరెన్సీ, ఆల్టో కారు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 27 స్టాంప్ పేపర్లు, నోట్ల ముద్రణా యంత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.