కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు రాజకీయాల్లో విరామం తీసుకోనని మాజీ ప్రధాని దేవెగౌడ ప్రకటించారు. చన్నపట్న నుంచి పోటీ చేస్తున్న మనవడు నిఖిల్ కుమారస్వామి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. చనిపోయేవరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కాగా నవంబర్ 13న చన్నపట్న అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.