AP: పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోని ICICI బ్యాంకుకు చెందిన మూడు శాఖల్లో సుమారు రూ.28 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రభుకిషోర్, నరేష్ కోసం ఏపీ సీఐడీ గాలింపు చేపట్టారు. ప్రభు కిషోర్ అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ మేనేజర్ నరేష్ డిపాజిట్‌దార్ల FDలు స్వాహా చేసి సొంత కంపెనీకి పెట్టుబడిగా మళ్లించాడు. తాజాగా నరేష్‌కి సహకరించిన హరీష్ అనే బ్యాంక్ అప్రైజర్ని అరెస్ట్ చేశారు.