AP: వైసీపీకి కాలం చెల్లిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఆ పార్టీకి సమన్వయకర్తలు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకపోవడంపై జగన్ చెప్పిన కారణం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.