KRNL: ఆదోనిలోని రైల్వే గేటుకు సంబంధించి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థల సేకరణ ప్రాంతాలను అధికారులతో కలిసి శుక్రవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన రికార్డులను మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఉప తహశీల్దార్ గుండల నాయక్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు, సూర్యలను అడిగి తెలుసుకున్నారు.