రాజమౌళి ఏది చేసిన పర్ఫెక్ట్గా ఉంటుంది. సినిమా సెట్లో ప్రతి చిన్న విషయంలో ఎంతో కేరింగ్ తీసుకుంటాడు జక్కన్న. అందుకే దర్శక ధీరుడు తీసిన ప్రతి సినిమా బ్లాక బస్టరే. అయితే ఇప్పట్లో రాజమౌళి నుంచి సినిమా వచ్చే ఛాన్స్ లేదు. కనీసం అందుకు రెండు, మూడేళ్ల సమయం ఉంది. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న పరిస్థితుల్లో.. బ్రహ్మాస్త్ర సినిమాను అన్ని తానై ముందుకు నడిపిస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తున్నాడంటే.. ఖచ్చితంగా విషయం ఉన్న సినిమానే అని నమ్ముతున్నారు జనాలు. దాంతో రాజమౌళి ప్రమోషన్స్ ముందు బాయ్ కాట్ బ్యాచ్ కొట్టుకుపోవడం ఖాయం. అయితే తెలుగులో మాత్రం జక్కన్నకు ఎదురు దెబ్బ పడింది. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌భీర్ కపూర్, ఆలియా భట్ జంటగా.. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. దాంతో సెప్టెంబర్ 2న భారీ ఎత్తున భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు జక్కన్న. దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీప్ గెస్ట్ కావడంతో.. ఈ ఈవెంట్ బ్రహ్మాస్త్రకు కీలకంగా మారింది.
ఈ ఈవెంట్లో తారక్‌తో తొడకొట్టించేందు రంగం సిద్ధం చేశాడు రాజమౌళి. కానీ చివరి నిమిషంలో ఊహించని విధంగా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఎంతో డిజప్పాయింట్ అయ్యారు. ఇక చేసేది లేక బ్రహ్మాస్త్ర టీమ్ ప్రెస్‌మీట్‌ను మరో చోట నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన అభిమానులకు క్షమాపణ చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కోసం వారం రోజుల నుంచి చాలా కష్టడినట్టు చెప్పాడు రాజమౌళి. అందుకోసం 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే లాస్ట్ మినిట్‌లో ఈవెంట్ కాన్సిల్ అవడంతో.. బ్రహ్మాస్త్ర టీమ్ 2 కోట్లకు పైగా నష్టం వచ్చినట్టేనని చెప్పొచ్చు. అంతేకాదు బ్రహ్మాస్త్రకు రావాల్సిన హైప్ రాలేదు. ఇలా రెండు విధాలుగా బ్రహ్మాస్త్రకు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.