TG: యాదాద్రి ఆలయాభివృద్ధి అథారిటీ(YTDA) అధికారులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించారు. యాదాద్రి ఆలయం వద్ద ప్రస్తుతం జరుగుతున్న పనులపై సీఎం ఆరా తీశారు. ఇవాళ సీఎం పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీటింగ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరయ్యారు.