ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధుల బారినపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో గుండె ఆరోగ్యంగా ఉండేందుకు పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయమం చేయటం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి, గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. శరీర బరువు, బీపీ, షుగర్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్స్, చిరుతిళ్లని దూరం పెట్టాలి. మనసు ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలి.