NZB: ఒక సాధారణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరచాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.