ఆస్ట్రేలియా Aతో జరగుతున్న అనధికారిక రెండో టెస్ట్‌లో కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై క్రికెట్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ‘అతడిని జట్టు నుంచి తీసేయండి ప్లీజ్’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.