TG: వరంగల్లోని భద్రకాళి చెరువు ప్రక్షాళన పనుల్లో భాగంగా నీటిని తొలగించటానికి అధికారులు చర్యలు చేపట్టారు. భద్రకాళి చెరువులోని నీటిని నాగారం చెరువులోకి పంపటానికి పనులు ప్రారంభించిన కొద్దిసేపటికే అధికారులు మత్స్యకారులను అడ్డుకున్నారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఉన్నపళంగా నీటిని తీసివేస్తే తమ ఆర్థిక వనరులు కోల్పోతామని.. తమకు ప్రత్యామ్నయం చూపించిన తర్వాత చెరువు ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.