మలయాళ స్టార్ మోహన్‌లాల్ ‘అమ్మ’ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మోహన్‌లాల్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అవి కేవలం రూమర్స్ మాత్రమేనని, ఆ కమిటీలో ఆఫీస్ బాయ్‌లా కూడా చేసే ఉద్దేశం తనకు లేదని క్లారటీ ఇచ్చారు. అలాగే హేమ కమిటీ రిపోర్ట్‌లో వెలుగులో వచ్చిన విషయాలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.