AP: ధాన్యం సేరణపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో నిబంధనలు లేకుండా రైతులు ధాన్యం అమ్ముకోవచ్చని తెలిపారు. ధాన్యం కొన్న 48 గంటల్లోనే రైతులకు నగదు చెల్లించనున్నట్లు వెల్లడించారు. రైతు వద్ద ప్రతి ధాన్యం గింజా కొంటామని భరోసా ఇచ్చారు.