SKLM: గత వైసీపీ ప్రభుత్వంలో పల్లెలను పూర్తిగా విస్మరించి ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేసిందని, కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి కట్టుబడి ఉందని శ్రీకాకుళం MLA గొండు శంకర్ అన్నారు. పాత్రునివలసలో రూ.52 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు.కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు.