AP: రాష్ట్రంలో YCP సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను మాజీ CM జగన్ ఖండించారు. ఎల్లోమీడియా, అనైతిక సోషల్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని.. ఈ యుద్ధంలో కచ్చితంగా న్యాయమే గెలుస్తుందని ట్వీట్ చేశారు. తమ కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు, నిర్బంధాలు జరుగుతున్నాయని.. ప్రతి సైనికుడికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైసీపీ కార్యకర్తలను.. ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందన్నారు.