అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుల మాఫీ కోసం ట్రంప్ మద్దతుదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. 2020 ఎన్నికల ఫలితాల అనంతరం యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద అల్లర్లు జరిగిన నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులపై కేసులు నమోదు చేశారు. అయితే, ట్రంప్ తిరిగి అధికారంలోకి రావటంతో ఆ కేసుల మాఫీ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వారు ‘దేశభక్తులు’, రాజకీయ ఖైదీలనీ గతంలోనే ట్రంప్ వారిని కీర్తించారు.