VZM: జిల్లాలో బడిబయట ఉన్న పిల్లలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో విద్యార్థి వారీగా నివేదిక రూపొందించాలని కలెక్టర్ అంబేడ్కర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న విద్యార్థుల సంఖ్య దృష్ట్యా సుమారు పదివేల మంది బడి బయట ఉండవచ్చని డీఈఓ తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిచారు.