చాలామందికి నెగిటివ్ థింకింగ్ పెద్ద సమస్యగా మారింది. దీన్ని తగ్గించుకోవడానికి రోజూ ఉదయం వ్యాయాయం, ధ్యానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేచిన తర్వాత మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది నచ్చకపోతే దాని గురించే ఆలోచించకూడదు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది కరెక్టా? కాదా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి.