సూర్యాపేట పట్టణానికి శుక్రవారం నుంచి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా సమృద్ధిగా సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ నివేదిత, కమిషనర్ హనుమంత రెడ్డి గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఇమాంపేటలోని మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద అత్యవసర మరమ్మతులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.