kanna joined tdp:టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ.. కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు
kanna joined tdp:సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటు అనుచరులు కూడా టీడీపీ (tdp) తీర్థం పుచ్చుకున్నారు.
kanna joined tdp:సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటు అనుచరులు కూడా టీడీపీ (tdp) తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు కన్నావారి తోటలో గల నివాసం నుంచి మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా కన్నా బయల్దేరారు. మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు (chandrababu naidu) చెప్పినట్టు తెలిసింది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ నేత జీవీఎల్‌తో విభేదించి కన్నా పార్టీని వీడారు. ఇదివరకు ఏపీ బీజేపీ చీఫ్‌గా పనిచేశారు. అంతకుముందు కన్నా లక్ష్మీ నారాయణ కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయం తీసుకొని.. వారి సూచన మేరకు టీడీపీలో చేరారు.
చంద్రబాబు నాయుడు (chandrababu) నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి అవుతుందని కన్నా (kanna laxmi narayana) అనుచరులు భావించారు. రాజధాని అమరావతి నిర్మాణం అవుతుందని అంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగల సమర్థుడు కావాలని, అందుకు చంద్రబాబే సరైన వ్యక్తి అని వారంతా అభిప్రాయపడ్డారు. కార్యకర్తల అభీష్టం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరాలని కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కాపు కోటాలో సీనియర్ రాజకీయ నేతకు మంత్రి పదవీ దక్కుతుంది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) టీడీపీలో చేరారని మరికొందరు అంటారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే సునాయాసంగా అధికారం దక్కించుకోవచ్చని భావించారని చెబుతున్నారు.