WGL: వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డా. సత్య శారద, చాహత్ బాజ్ పాయ్ శనివారం వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట–రంగసముద్రం చెరువు బండ్ సుందరీకరణ, అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి అయ్యేలా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.