MNCL: దండేపల్లి మండలకేంద్రంలో శనివారం ఐకేపీ, సెర్ప్ వీవోఏలు కండ్లకు నల్ల గుడ్డలు కట్టుకొని నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు బద్రి సత్తన్న మాట్లాడుతూ.. ప్రభుత్వం వివోఏలకు కనీస వేతనం రూ 20,000 చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వివోఏలకు పదోన్నతులను కల్పించడంతోపాటు రూ. 10 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు.