JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి గ్రామానికి చెందిన సేవెల్ల కిష్టయ్య శనివారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య మృతుడి అంతక్రియలో పాల్గొన్నారు. పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.