AP: మరి కాసేపట్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షంతో పాటు వచ్చే 3 గంటల పాటు ఈ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్సుందని వెల్లడించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ల కింద నిలబడవద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు APSDMA సూచించింది.