కోనసీమ: అమలాపురం మండలం రంగాపురం ప్రాంతంలో కరికాల భక్త కల్యాణ మండప నిర్మాణ పనులకు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు శనివారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు వివిధ శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అవసరమైన భవనాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.