NDL: బేతంచెర్ల మండలం రంగాపురంలో పులగుమ్మి మనోహర్‌కు చెందిన రెండు గడ్డి వాములు శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న డోన్ అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైరింజన్ చేరుకొని సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. రూ.1.20 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు మనోహర్ వాపోయాడు.