దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(అక్టోబర్ 4న) భారీ లాభాలతో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ ఒకదశలో 1,191 పాయింట్లు పెరుగగా.. NSE నిఫ్టీ 345 పాయింట్లు వృద్ధి చెందింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా వరుసగా 979, 533 పాయింట్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల ధోరణులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
సోమవారం ఆసియా, అమెరికా మార్కెట్లు పుంజుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు బ్రిటన్లో ధనవంతులపై అధిక పన్ను విధానం తొలగించడం కూడా సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. గతకొన్ని రోజులుగా నష్టాలతో కొనసాగిన మార్కెట్లు ఈరోజు ఒక్కసారిగా వృద్ధి దిశగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం అదానీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టీసీఎస్, ఇండస్ ఇండ్, HDFC, ICICI, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు టాప్ 10 లాభాల్లో కొనసాగుతుండగా..రెడ్డీస్ ల్యాబ్, పవర్ గ్రిడ్ సహా పలు సంస్థలు నష్టాల్లో ఉన్నాయి.