ATP: గుంతకల్లు మున్సిపల్ కమీషనర్ లక్ష్మిదేవి, శుక్రవారం ఉదయం శానిటేషన్ పనులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా టీ షాప్ నిర్వాహకుడు టీ కప్స్ రోడ్ పై పారవేస్తునందుకు రూ.500 పెనాల్టీ విధించడం జరిగింది. ఇకనుంచి ఒక్క టీ కప్పు కూడ రోడ్ పై వేయనీయకుండా షాప్ నందు ఉన్న డస్ట్ బిన్ లోనే వేసి పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.